TEJA NEWS

ఇండ్లు కూలిపోయిన ఇద్దరూ బాధితులకు10,000 ఆర్థిక సహాయం చేసిన, తిరుమల మహేష్
వనపర్తి

గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు, నియోజకవర్గంలోని తాటిపాముల గ్రామంలో నాగరాజు (చెర్రీ) ఇల్లు మరియు గోపాల్ ఇల్లు కూలీపోయి, వారు నిరాశ్రయులు అయిన విషయాన్ని, నాగరాజు కుటుంబం గ్రామ పంచాయతీ కార్యాలయంలో తలదాచుకున్న విషయాన్ని,గోపాల్ కుటుంబ పరిస్థితి గురించి, నిన్న నేను గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు దాడి యోగానంద రెడ్డి ,తిరుమల డెవలపర్ అధినేత, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల మహేష్ కి, ఫోన్ చేసి గ్రామంలో నెలకొన్న బాధిత కుటుంబాల పరిస్థితి నీ గురించి 2 నిరుపేద కుటుంబాలకు సహాయం చేయమని ఒక్కొక్కరికి 5000 పంపమని అడుగగా,ఇద్దరికీ వనపర్తి పట్టణ నాయిబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు,ఉపాధ్యక్షులు,సంఘం సభ్యుల చేత , గ్రామానికీ 10,000 పంపడం జరిగింది.వాళ్ళు కూలిపోయిన ఇద్దరి ఇండ్ల దగ్గరకు వెళ్ళి నాగరాజుకు 5000 మరియు గోపాల్ కు 5000 మొత్తం 10000 రూపాయలు అందజేశారు. అడిగిన తక్షణమే పెద్ద మనసుతో స్పందించి సహాయం చేసిన,తిరుమల మహేష్ కి హృదయపూర్వక తెలియజేశారు .ఈ కార్యక్రమంలో,వనపర్తి పట్టణ నాయిబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు చంద్ర కుమార్ నాయి,మాజీ అధ్యక్షుడు అశ్విని రమేష్ నాయి, చందా పూర్ సదుర్ల పాండు నాయి, తాటిపాముల గ్రామ నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు శ్రీను నాయి,మోహన్ నాయి తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS