సంకల్పఫల రైతు ఉత్పత్తి దారుల 5వ మహజన సమావేశం
ముఖ్య అతిథులుగా:- సీఈఓ మౌతిక…
అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముషిడివాడ ఐదు వసంతాల పూర్తి చేసుకుని ఆరువ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా సంకల్పఫల రైతు ఉత్పత్తి దారుల కంపెనీ లిమిటెడ్ ప్రాతినిద్య మహాజన సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రైతు పంటల ఉత్పత్తులపై ఎన్ని ఒడిదుడుకులు ఉన్న లాభనష్టాలను సరి చూసుకొని వ్యవసాయమే ప్రధానమార్గంగా ముందుకు సాగుతున్నదే మన సంకల్పఫల రైతు ఉత్పత్తిదారుల కంపెనీ, నాబార్డ్ వారి ఆర్థిక సహకారంతో జాగృతి సంస్థ ద్వారా ఏర్పాటు కాబడ్డ మన రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ద్వారా రైతు సభ్యులకు కావాల్సిన వివిధ రకాల మార్కెటింగ్ సేవలు అందించడంతో పాటు వారికి కావాల్సిన విలువ ఆధారిత సేవలను కూడా మన కంపెనీ ద్వారా రైతు సభ్యులకు అందించడం జరుగుతోంది, మన సంకల్ప ఫ్.పీ.సీ ప్రతి సంవత్సరం ఆడిట్ చేయించడంతో పాటు అన్ని చట్టబద్ధమైన కార్యక్రమాలను పూర్తిచేసికొని, తదుపరి కార్యక్రమాలను రూపకల్పన చేసుకుంటున్నది, 2019వ సంవత్సరం పరవాడ మండలంలో పది గ్రామాల రైతులతో ప్రారంభమై 2024 నాటికి 563 మంది సభ్యులతో 63.5 లక్షల టర్నోవర్ చేస్తూ, ఉద్యాన శాఖ సహాయంతో 15 విలువైన కలెక్షన్ సెంటర్ నిర్మించడం అయినది, మరియు నాబార్డ్ వారి సహకారంతో 12 లక్షల విలువగల రూరల్ మార్ట్ వ్యాన్ ఏర్పాటు చేసుకోవడం అయినది. మన జాగృతి సంస్థ సహకారంతో మన సంఘ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ కందర్ప రామకృష్ణ గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే క్రమంలో మనమంతా పారదర్శకంగా వ్యాపార దృక్పథంతో ప్రణాళిక బద్దకంగా మన రైతుల ఆదాయం రెట్టింపు చేసే విధంగా కృషి చేస్తూ సంకల్పఫల ఫ్.పి.సి అభివృద్ధికితోడ్పడుతున్న జాగృతి సొసైటీ సబ్బవరం వారికి నాబార్డ్ వారికి, ఉద్యాన శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో కంపెనీ ముఖ్యకార్యనిర్వహణాధికారి( సీఈఓ) మామిడి వెంకటేశ్వర్లు,గ్రామ సర్పంచ్ పల్లా నాగమణి,చైర్మన్ సీతిని అప్పారావు, డైరెక్టర్ దుల్ల చల్లారు,డైరెక్టర్ మజ్జి అప్పారావు, డైరెక్టర్ కోరుకొండ వెంకటరమణ, డైరెక్టర్ పోతుల నూకరత్నం,మతిదుల్ల రమణమ్మ, డైరెక్టర్ మడక చిలకమ్మ విజయ, డైరెక్టర్ కోరుకొండ దేవుడు,తదితరులు పాల్గొన్నారు.
సంకల్పఫల రైతు ఉత్పత్తి దారుల 5వ మహజన సమావేశం
Related Posts
రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాల చట్టాన్ని
TEJA NEWS రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి గత ప్రభుత్వ నిర్లక్ష్యంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆందోళన గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఆహార భద్రత కోసం కేంద్రం అందించిన రూ.65 కోట్లు నిరుపయోగం కేంద్రం…
వైసిపి కార్యకర్తను పరామర్శించిన పైలా శ్రీనివాసరావు
TEJA NEWS వైసిపి కార్యకర్తను పరామర్శించిన పైలా శ్రీనివాసరావు పరవాడ వై.సి.పి సీనియర్ కార్యకర్త పైల రాధాకృష్ణ ఎన్టి.పి.సి లో ఉద్యోగ నిమిత్తం పని చేస్తుండగా ప్రమాద వశాత్తు కాలు జారీ పడిపోవడం తో పరవాడ శ్రీ ఆధ్య హాస్పటల్ నందు…