TEJA NEWS

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అదివ్వలేదు.. ఇదివ్వలేదు అని ప్రచారం చేయడమే కాదు.. అసలు ఏమిచ్చిందో వ్యంగ్యంగా వివరించేందుకు కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘురాంరెడ్డి తనదైన శైలిలో ప్రదర్శన చేసి అందరినీ ఆకట్టుకున్నారు. కొత్తగూడెంలోని ప్రకాశం మైదానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరైన జనజాతర సభలో.. కేంద్ర సర్కారు రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చింది అంటూ.. రాసి ఉన్న గాడిద చిత్రం, దాని గుడ్డు ఆకృతిని ప్రదర్శించారు. కొత్త పరిశ్రమలు, రైల్వే కోచ్ లు, విభజన హామీలు అటకెక్కాయి అని సీఎం చెబుతుండగా.. ఇదిగో ఈ ఖరం గుడ్డు మాత్రమే ప్రధాని మోదీ ఇచ్చారని.. మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ తో కలిసి గాడిద గుడ్డు రూపును సభకు హాజరైన వారికి చూపుతూ.. ఆలోచింపజేశారు. సూపర్..సార్ అంటూ కాంగ్రెస్ శ్రేణులు ఈలలు వేశారు.


TEJA NEWS