TEJA NEWS

చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించాలని కొండకల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల పరిధి కొండకల్ గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించి ఓట్లను అడిగారు. తెలంగాణలో కెసిఆర్ లేని లోటు అందరికీ తెలుస్తుందని చెప్పుకొచ్చారు .ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు


TEJA NEWS