TEJA NEWS

ఎమ్మెల్యే జారే ఆర్థిక సహాయంతో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
దమ్మపేట మండలం గండుగులపల్లి ప్రైమరీ స్కూల్ లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మండల ప్రజలకు ఆహ్వానం పలికారు.
అశ్వారావుపేట శాసనసభ్యులు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సహకారంతో నియోజకవర్గ ప్రజల కోసం అక్టోబరు 30/ అక్టోబర్/ 2025 గురువారం రోజున గండుగులపల్లి లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని హైదరాబాద్‌లోని ప్రముఖ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ శిబిరాన్ని నిర్వహిస్తోంది.
సమయం : ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 03:00 గంటల వరకు వేదిక: స్థలం, గండుగులపల్లి ప్రైమరీ స్కూల్ గ్రౌండ్‌, నిర్వాహకులు: బసవతారకం హాస్పిటల్, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆర్థిక సహకారంతో క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించి, చికిత్స చేయడం ద్వారా సంపూర్ణంగా నయం చేయవచ్చని, ముఖ్యంగా లక్షణాలు లేకున్నా ముందు జాగ్రత్తగా పరీక్ష చేయించుకోవడం అత్యవసరమని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఎవరు తప్పక హాజరు కావాలి : 30 ఏళ్లు పైబడిన మహిళలు, పొగాకు ఉత్పత్తులు, మద్యం సేవించే అలవాటు ఉన్నవారు. కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారు. తరచూ అనారోగ్య లక్షణాలు లేదా అసాధారణ మార్పులు గమనించినవారు. శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్య బృందం ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేసి, అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్యకరమైన జీవనానికి ముందస్తు పరీక్షలు తప్పనిసరని ఎమ్మెల్యే ఆదినారాయణ కోరారు. మరిన్ని వివరాలకు: 040-2355 1235 (EXTN 2354), 8008 305 599, లేదా 6301 147 817 నంబర్లలో సంప్రదించవచ్చు. ఈ శిబిరాన్ని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వారు రోడ్డు నెం. 10, బంజారా హిల్స్, హైదరాబాద్ నుంచి వచ్చి నిర్వహిస్తున్నారు.