TEJA NEWS

ఒకే పోలీస్‌ విధానం అమలు చేయాలంటూ.. మామునూరు బెటాలియన్‌లో కానిస్టేబుళ్ల ఆందోళన

హైదరాబాద్‌:-రాష్ట్రంలో ఏక్‌ పోలీస్‌ విధానం కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిన్నటివరకు బెటాలియన్‌ పోలీసుల కుటుంబ సభ్యులు రోడ్లపై నిరసన వ్యక్తం చేయగా, ఇప్పుడు కానిస్టేబుళ్లు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. రేవంత్‌ సర్కార్‌ అసమర్ధ విధానాలపై కన్నెర్ర చేశారు. వరంగల్‌లోని మామునూరు ఫోర్త్‌ బెటాలియన్‌లో ఆందోళనకు దిగారు. బెటాలియన్‌ కమాండెంట్‌ ఆఫీస్‌ ముందు బైఠాయించారు. ఒకే పోలీస్‌ విధానం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

మరోవైపు నల్లగొండ జిల్లా అన్నెపర్తి బెటాలియన్‌లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంపై కానిస్టేబుళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండ రూరల్‌ ఎస్సై సైదాబాబును సస్పెండ్‌ చేయాలని నిరసనకు దిగారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ కుటుంబ సభ్యుల మీద అసభ్యకరంగా నోటికి వచ్చినట్టు మాట్లాడాడని ఆరోపించారు. తక్షణమే సైదా బాబుని సస్పెండ్ చేయాలని, లేనట్లయితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. అయితే బందోబస్తు విధుల్లో ఉన్న సైదాబాబు వద్దకు కానిస్టేబుళ్లు రావడంతో.. బెటాలియన్‌ అధికారులు అతడిని అక్కడిని నుంచి పంపించేశారు


TEJA NEWS