TEJA NEWS

డిప్యూటీ సీఎం పవన్ టార్గెట్‌గా ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్

హైదరాబాద్: తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ – నటుడు ప్రకాశ్ రాజ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ ఈ రోజు (గురువారం) మరో ట్వీట్ చేశారు.

గెలిచేముందు ఒక అవతారం… గెలిచిన తర్వాత ఇంకో అవతారం అంటూ పవన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ‘‘ఏంటీ అవాంతరం.. ఏందుకు మనకీ అయోమయం.. ఏది నిజం?. జస్ట్‌ ఆస్కింగ్‌’’ అని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.

కాగా తిరుమల లడ్డూ వ్యవహారంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రాయశ్చిత దీక్షలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. హిందూ ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడేవారిని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రకాశ్‌రాజ్‌ పోస్టులపై కూడా పవన్ అసహనం వ్యక్తం చేశారు. సున్నితాంశాలపై ప్రకాశ్‌రాజ్‌ తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ప్రకాశ్‌రాజ్‌ అంటే గౌరవం ఉందని, కానీ విమర్శలు చేసే ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలని హితవు పలికారు. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని పవన్‌ హెచ్చరించారు. దీనిపై ప్రకాశ్‌ రాజ్‌ స్పందిస్తూ ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని, ఇండియాకు వచ్చాక పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నలకు సమాధానమిస్తానని పేర్కొన్న విషయం తెలిసిందే.


TEJA NEWS