TEJA NEWS

టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై దాడి అనాగరికం
టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పుల్లయ్య

ఉమ్మడి ఖమ్మం

ఖమ్మం జిల్లా మున్నేరు పరివాహక ప్రాంతంలో మంగళవారం టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం సహాయక చర్యలు వరద బాధితులను పరామర్శించడానికి వచ్చిన వారిపై అధికార పార్టీకి చెందిన కొందరు దుండగులు దాడి చేయడం రాళ్లు విసరడం సరైన చర్య కాదని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య బుధవారం తెలిపారు మండల పరిధిలో రచ్చగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో సాయం చేయటానికి పరామర్శించడానికి వచ్చిన ప్రజాప్రతినిధులపై దాడి ఘటనలు సరికాదని, అధికారం ఎవరికి శాశ్వతం కాదని చరిత్ర చెబుతుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఇలాంటి పద్ధతుల్ని అనాగరిక చర్యల్ని టిఆర్ఎస్ పార్టీ చింతకాని మండల కమిటీ ఖండిస్తున్నామని తెలిపారు . పార్టీలకతీతంగా వరద బాధితుల కోసం సహాయం చేయడానికి వచ్చిన వారిపై దాడి చేయడం సమంజసం కాదని టిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ దాడికి ఖండన తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ సభ్యులు ఆయా గ్రామ శాఖ అధ్యక్షులు మాజీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

TEJA NEWS