TEJA NEWS

వాడచీపురుపల్లి జడ్పీ హైస్కూల్ వెనుక తుప్పల్లో చేమలు పట్టిన శిశువు మృతదేహం లభ్యం..

అనకాపల్లి జిల్లా పరవాడ మండలం చీపురుపల్లి లో రోడ్డు పక్కన నవజాత శిశువు మృతదేహం ఉందని స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న వీఆర్వో పోలీస్ లకు ఫిర్యాదు చేసిన సంఘటన రాత్రి పరవాడ మండలంలో గల వాడ చీపురుపల్లి శివారులో చోటుచేసుకుంది. దీనిపై స్థానిక సీఐ మల్లికార్జునరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.వాడ చీపురు పల్లి నుండి తిక్కవానిపాలెం వెళ్లే రహదా రిలో రోడ్డు పక్కన పొదలలో మగ నవజాత శిశువు మృతదేహం పడి ఉందని వాడ చీపురుపల్లి విఆర్ది రొంగలి హైమ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శిశువు మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS