బీజేపీ రాష్ట్ర మహిళా నేత జన్మదిన వేడుక
తిరుపతి: భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ గాలి పుష్పలత జన్మదిన వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా ఆమెకు బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుండాల గోపినాథ్ రెడ్డి, ఇతర బీజేపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. గాలి పుష్పలత కలియుగ వేంకటేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులతో మరెన్నో జన్మదినాలు సంపూర్ణ ఆరోగ్యంగా జరుపుకోవాలని కోరారు. ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో బిజెపి సీనియర్ నాయకులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, పురోహితుడు సురేష్ స్వామి, ప్రముఖ యాంకర్ పుష్ప శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
