TEJA NEWS

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ?

అమరావతి:
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారా యణ పోటీ చేయనున్నారు. ఈ మేరకు పార్టీ అధినాయ కత్వం బొత్స పేరును ప్రకటించింది.

విశాఖ జిల్లా పార్టీ నేతలతో మాట్లాడిన తర్వాత వారి అభిప్రాయాలను తెలుసు కున్న జగన్ బొత్స సత్యనా రాయణను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఆయనయితే ఉత్తరాంధ్ర జిల్లాలో గెలవడం సులభ మవుతుందని భావించి బొత్స పేరును జగన్ ఖరారు చేసినట్టు సమాచారం. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం కోసం.. ఆగస్టు 6న ఉపఎన్నిక నోటిఫికేషన్‌ విడుదలవు తుంది.

అదేరోజు నుంచి నామినే షన్ల స్వీకరణ మొదలవు తుంది. ఆగస్టు 13 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉంది. 14న పరిశీలన.. ఆగస్టు 16న ఉపసంహరణకు గడువుగా ఈసీ నిర్ణయించింది. ఆగస్టు 30న ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల వరకు ఉపఎన్నిక జరుగుతుంది..

Print Friendly, PDF & Email

TEJA NEWS