గోవింద ఇంట్లో పేలిన బుల్లెట్… ఆసుపత్రికి తరలింపు .
ప్రముఖ నటుడు గోవింద ఇంట్లో అనుకోని ఘటన జరిగింది. ఆయన లైసెన్స్డ్ రివాల్వర్ అనుకోకుండా పేలింది. దాంతో గోవింద కాలిలో బుల్లెట్ దూసుకుపోయింది. వెంటనే ఆయన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్యులు గోవింద శరీరంలోని బుల్లెట్ తొలగించారు. ప్రస్తుతం గోవింద ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావాల్సివుంది.
ఈరోజు ఉదయం ముంబైలోని తన నివాసం నుంచి కొలకొత్తా బయల్దేరాల్సివుంది. గోవింద ఎక్కడకు వెళ్లినా లైసెన్స్డ్ రివాల్వర్ తీసుకెళ్లడం అలవాటు. అలా రివాల్వర్ క్యారీ చేస్తుండగా పొరపాటున కిందపడి పేలింది. అప్పటికే రివాల్వర్ ని లోడ్ చేసి ఉండడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకొంది. కొద్దిరోజులు గోవిందా ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. నిజానికి ఏం జరిగింది? గోవింద ఇంట్లో పొరపాటుగానే తుపాకీ పేలిందా? లేదంటే దీని వెనుక మిస్టరీ ఏమైనా ఉందా అనేది పోలీసులే తేల్చాలి.