సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సాయి నగర్ వెస్ట్ కాలనీలో రోడ్డు నెంబర్ 4 లో పదిహేడు లక్షల రూపాయల నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సీసీ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. రోడ్డును మంచిగా లెవెలింగ్ చేసి వర్షపు నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో నిర్మాణ పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో శివరాజ్ గౌడ్, రాజేష్ చంద్ర, వీరస్వామి జ్యోతిబా, సాయి, కోటేశ్వరరావు, రామయ్య చౌదరి, బాలు, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.
సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
Related Posts
మూడవ రోజు అన్నపూర్ణ దేవికి ఘనంగా పూజలు
TEJA NEWS మూడవ రోజు అన్నపూర్ణ దేవికి ఘనంగా పూజలు శంకర్పల్లి : దేవీ నవరాత్రులలో మూడో రోజు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో పూజిస్తారు. కొండకల్ గ్రామం లో అన్నపూర్ణ దేవికి చరణ్ సార్క్ ప్రాజెక్ట్స్ వారి ఆధ్వర్యం లో…
కాళోజి యూనివర్సిటీలో ఎంబిబిఎస్ సీటు సాధించిన చేవెళ్ల విద్యార్థి.
TEJA NEWS కాళోజి యూనివర్సిటీలో ఎంబిబిఎస్ సీటు సాధించిన చేవెళ్ల విద్యార్థి. సన్మానం చేసిన చేవెళ్ల న్యాయవాదులు. చేవెళ్ల మట్టిలో పుట్టిన మాణిక్యంలాగా పరిశుద్ధ కార్మికునిగా పనిచేస్తున్న వ్యక్తి కూతురు కాలోజీ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ సీటు సంపాదించింది. చేవెళ్ల గ్రామంలో పారిశుద్ధ…