ఎల్లమ్మచెరువు లో దోమల నివారణ చర్యలు చేపట్టిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

ఎల్లమ్మచెరువు లో దోమల నివారణ చర్యలు చేపట్టిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

TEJA NEWS

Corporator Venkatesh Goud who has taken measures to prevent mosquitoes in Ellammacheruvu

ఎల్లమ్మచెరువు లో దోమల నివారణ చర్యలు చేపట్టిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

124 డివిజన్ పరిధిలోని ఎల్లమ్మచెరువు పరిసర ప్రాంతాలలో దోమలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని జయ నగర్ కాలనీ వాసులు సమస్యను స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ ఎంటమాలజీ ఎఇ ఉషారాణి మరియ వారి సిబ్బందితో కలిసి ఎల్లమ్మచెరువు లో దోమల నివారణ మందులు పిచికారి చేసి, లార్వా పెరగకుండా ఉండేలా మస్కిటో లార్వా సైడ్ ఆయిల్ బాల్స్ ను చెరువులో వేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వర్షాకాలంలో దోమల వల్ల డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు సోకె ప్రమాదముంది కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఇల్లు మరియు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ముఖ్యంగా నీటి నిలువలు ఉండకుండా చూసుకోవాలని అన్నారు. ఈ ఆయిల్ బాల్స్ వేయడంతో నీటిలో ఆయిల్ ఫామ్ అయ్యి దోమ పిల్లలు చనిపోతాయని అన్నారు. కార్యక్రమంలో సమ్మారెడ్డి, షౌకత్ అలీ మున్నా, విష్ణు, వెంకట్ రెడ్డి, ఎంటమాలజీ సూపర్వైజర్ డి.నరసింహులు మరియు ఎంటమాలజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి