TEJA NEWS

బాధితులకు బాసటగా సిపిఐ

రామన్నపేట కాలనీలో భోజన వితరణ

ఉమ్మడి ఖమ్మం

మున్నేరు బాధితులకు సిపిఐ జిల్లా సమితి బాసటగా నిలుస్తుంది. వరద వచ్చిన నాటి నుంచి బాధిత కుటుంబాలను పరామర్శిస్తూ మనో ధైర్యం కల్పిస్తూ వీలైనంత మేర సహయం చేస్తూ ముందుకు సాగుతున్నారు. తొలి రోజే వరద బాధితులకు మంచినీళ్లు, అరటిపండ్లు అందించి తాత్కాలిక ఉపశమనం కలిగించారు. మరుసటి రోజు పెద్ద ఎత్తున ఆహార పొట్లాలు అందించిన సిపిఐ కార్యకర్తలు బుధవారం రూరల్ మండలం రామన్నపేట కాలనీలో వందలాది మంది బాధితులకు ఆహారాన్ని అందించారు. సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా హేమంతరావు మాట్లాడుతూ విశాల హృదయంతో బాధితులను అదుకునేందుకు దాతలు ముందుకు రావాలన్నారు. ఏనాడు లేనివిధంగా ఒక విపత్తు సంభవించిందని వేలాది ముంది నిరాశ్రయులయ్యాదన్నారు. ప్రభుత్వం, స్వచ్చంద సంస్థలు వీలైనంత త్వరగా ఉపశమన చర్యలు చేపట్టాలని, సహాయ చర్యలను వేగిర పర్చాలన్నారు. ముంపు ప్రాంతాలలో తాగునీరు, విద్యుత్ను పునరుద్దరించడంతో పాటు ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయాలని హేమంతరావు కోరారు. అంతకు ముందు త్రీటౌన్ ప్రాంతంలో సిపిఐ ఏరియా కార్యదర్శి నూనె శశిధర్ ఆధ్వర్యంలో నిరాశ్రయులైన పేదలకు భోజన వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు జమ్ముల జితేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు పోటు కళావతి, తాటి వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు బోజర్ల సూర్యం, పోటు పూర్ణచందర్రావు, ఏఐఎస్ఎఫ్, ఏఐనైఎఫ్ నాయకులు మడుపల్లి లక్ష్మణ్, ఇటికాల రామకృష్ణ, శ్రావణ్, శివ, స్థానిక సిపిఐ నాయకులు పీట్ల కృష్ణమూర్తి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS