TEJA NEWS

చేర్యాల కు మంజూరైన కోర్టు ను వెంటనే ప్రారంభించాలి. సీపీఎం..
చేర్యాల ప్రాంతం పై పాలకులు నిర్లక్షం వీడాలి.. ఆముదాల మల్లారెడ్డి

సిద్దిపేట జిల్లా

చేర్యాల ప్రాంతంలో వేల సంఖ్యలో కోర్టు కేసులు ఉన్నాయని వీటి పరిష్కారానికి చేర్యాల పట్టణ కేంద్రంలో కోర్టును ఏర్పాటు చేయాలని సిపిఎం మరియు జేఏసీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించిన ఫలితంగా సాధించుకున్న కోర్టును రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ప్రారంభించడం లేదని సంబంధిత అధికారులు, అధికార కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాపరెడ్డి, ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర్ రెడ్డి లు వెంటనే చొరవ తీసుకొని చేర్యాల కోర్టును ప్రారంభించి చేర్యాల ప్రాంత ప్రజలకు సౌలభ్యం కల్పించి చేర్యాల ప్రాంత అభివృద్ధికి చర్యలు చేపట్టాలని సిపిఐఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి డిమాండ్ చేశారు. రోజున సిపిఎం ఆధ్వర్యంలో వెంటనే కోర్టును ప్రారంభించాలని చేర్యాల మెయిన్ రోడ్డు గాంధీ సెంటర్ నుండి కోర్టుకు కేటాయించిన భవనం ఎంపీడీవో కార్యాలయం వరకు రెండు కిలోమీటర్ల పాటు పాదయాత్రను నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఆముదాల మల్లారెడ్డి మాట్లాడుతూ చేర్యాల ప్రాంత నాలుగు మండలాలకు సంబంధించి 53 గ్రామాల ప్రజలు మద్దూరు దూల్మిట నుండి హుస్నాబాద్ కోర్టుకు, చేర్యాల కొమురవెల్లి మండలం, చేర్యాల పట్టణం నుండి సిద్దిపేట కోర్టులకు వాది, ప్రతివాదులు, సాక్షిదారులు వీరి వెంట బంధువులు, స్నేహితులు మరియు కోర్టులో వాదించే అడ్వకేట్లు ప్రతిరోజు వంద లాది మంది ప్రస్తుతం సిద్దిపేట, హుస్నాబాద్ కోర్టులకు వెళుతూ అనేక ఇబ్బందులు పడుతున్నారని, మన ప్రాంతం నుండి వేల సంఖ్యలో కేసులు ఉన్నందున చేర్యాలలో ప్రత్యేక కోర్టు ఏర్పాటుకై అనేక సంవత్సరాల నుండి పోరాడుతున్నప్పటికీ గత రెండు సంవత్సరాల క్రితం ఈ కోర్టును ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ ప్రారంభించడంలో కాలయాపన చేస్తున్నారని వెంటనే ఈ కోర్టును ప్రారంభించేందుకు కాంగ్రెస్ పాలక పార్టీ ప్రతినిదికి కోర్టు సమస్య పట్టదా మరియు చేర్యాల ప్రాంత ఎమ్మెల్యేకు చేర్యాల కోర్టును పట్టించుకునే పరిస్థితి లేదని, కోర్టు సంబంధిత అధికారులు ఇప్పటికైనా చేర్యాల ప్రాంత కోర్టు సమస్యను పరిష్కరించి ప్రారంభించాలని, గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఈ ప్రాంత సమస్యలపై కోర్టు విషయంలో కానీ రెవెన్యూ డివిజన్ విషయంలో కానీ ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో కానీ అనేక పోరాటాలు నిర్వహించినప్పటికీ ఈ ప్రాంత ప్రజలకు పోరాట చరిత్ర నే మిగులుతుంది కానీ ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయకుండా చేర్యాల ప్రాంత ప్రజలను మభ్యపెడు తున్నారు.

ఈ రకంగా మభ్యపెట్టి కాలం వెళ్ళబుచ్చు కోవడం సరి అయింది కాదని చేర్యాల ప్రాంత ప్రజలు అధికార కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిని, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ను, చేర్యాల ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇప్పటికే ప్రజలు అసంతృప్తితో ఉన్నారని నిర్లక్ష్యం వహిస్తే వీరిపై తిరుగుబాటు పోరాటాలు తప్పవని ఇప్పటికైనా చేర్యాల ప్రాంత ప్రజల సౌకర్యార్థం వెంటనే కోర్టును ఏర్పాటు చేయాలని లేనిపక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో 4 మండలాల ప్రజలను ఏకం చేసి పోరాటాన్ని బలోపేతం చేస్తామని చేర్యాల ప్రాంతంలో కోర్టును, రెవెన్యూ డివిజన్ ను, నియోజకవర్గ కేంద్రాన్ని సాధించుకునేంతవరకు సిపిఎం పార్టీ పోరాటాలు కొనసాగిస్తుందని సిపిఎం చేర్యాల ప్రాంత ప్రజా సమస్యలపై నిర్వహించే ప్రతి పోరాటంలో ప్రజలు పెద్ద ఎత్తున కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాళ్ల బండి శశిధర్, శెట్టిపల్లి సత్తిరెడ్డి, చేర్యాల మండల కార్యదర్శి కొంగరి వెంకట మావో, చేర్యాల పట్టణ కార్యదర్శి రాళ్ల బండి నాగరాజు, మద్దూరు మండల కార్యదర్శి ఆలేటి యాదగిరి, దూల్మిట్ట మండల బాధ్యులు చొప్పరి రవికుమార్, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బండ కింది అరుణ్ కుమార్, రామ్ సాగర్ సర్పంచ్ తాడూరి రవీందర్, అత్తిని శారద, దాసరి ప్రశాంత్, పోలోజు శ్రీహరి, ఆముదాల నర్సిరెడ్డి మాకు దేవేందర్ రెడ్డి బోయిని మల్లేశం, బక్కేల్లి బాలకిషన్ నాగపురి కనకయ్య గొర్రె శ్రీనివాస్ రేపాక కుమార్ మల్కని ఎల్లయ్య, తాడూరి మల్లేశం, ఎండి కరీం, రంజిత్ రెడ్డి, అజ్గర్, బెజడి మల్లారెడ్డి, మంచాల నారాయణ, డి కనకయ్య, గంధాల బాలు , రమేష్ , భీమ సీను, కనుక లక్ష్మి, ఎండి ఎజాస్, షాకీర్, అప్సర్, పండుగ యాదగిరి, గర్నపల్లి చంద్రం,బైరలింగం, తాడూరు భరత్, తోడెంగల రామచంద్రం ,ఇప్పకాయల రాములు, కలకుంట్ల ఆంజనేయులు, సూర్య తిరుపతి, బుడిగం చంద్రారెడ్డి, ఎలా శంబయ్య, డానియల్, బ్రహ్మయ్య సహదేవులు ,తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS