TEJA NEWS

పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన దయాకర్ రెడ్డి

ముదిగొండ మండలంలోని లక్ష్మిపురంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. అవకాశాన్ని రైతు సోదరులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, దేవరపల్లి అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఖమ్మం రూరల్ మండలం చల్లపల్లి గార్డెన్స్ లో జరిగిన చల్లపల్లి రాధమ్మ దశదిన కర్మలో పాల్గొన్నారు. ఆమె చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు.


TEJA NEWS