TEJA NEWS

వెల్గటూర్: ముంపు గ్రామాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ

ధర్మపురి : వెల్గటూర్ మండలం చెగ్యాం గ్రామంలోని ముంపు
ప్రాంతాన్ని నేడు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్
కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ.. శిథిలావస్థలో ఉన్న బడిలో నివసిస్తున్న
ప్రజలను కలిసి వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేసి
సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని ఎస్పీ వారికి సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట డీఎస్పీ రఘు చందర్,
సీఐ రాంనరసింహారెడ్డి, ఎస్సై ఉమాసాగర్ ఉన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS