TEJA NEWS

స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమం లో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలి….ఎంపీవో గిరి రాజు

శంకరపల్లి మండల పరిధి లోని కొండకల్ గ్రామం లో స్వచ్ఛదనం -పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు . ఈ కార్యక్రమం లో భాగంగా 2వ రోజు కొండకల్ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎల్లయ్య మిషన్ భగీరథ నీటి ట్యాంక్ లను పరిశుభ్రం చేయించారు . అనంతరం జిల్లా ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో స్వచ్ఛదనం -పచ్చదనం ర్యాలి నిర్వహించి ప్రజలకి అవగాహన కల్పించారు .స్మశాన వాటిక లో మరియు కాలి స్థలాలలో మొక్కలను నాటారు .గ్రామ సభ కార్యక్రమం ఏర్పాటు చేసి వర్షపు నీరు , త్రాగు నీరు వృధా చేస్తే రేపటి రోజు మనకి ఇబ్బంది కలుగుతుంది అని తెలియజేశారు . ప్రజలు అందరూ స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమం విజయవంతం చేయాలని కొనియాడారు. ఈ కార్యక్రమం లో ఎంపీఒ గిరి రాజు , పంచాయతీ సెక్రటరీ ఎల్లయ్య , పాఠశాల ఉపాధ్యాయులు . మరియు గ్రామ పంచాయతీ సభ్యులు ,మహిళా సంఘ సభ్యులు ,తదితరులు పాల్గొన్నారు .

Print Friendly, PDF & Email

TEJA NEWS