TEJA NEWS

కుమారుడి జ్ఞాపకార్థం విద్యార్థులకు భోజనం ప్లేట్లను పంపిణీ చేసిన కుటుంబసభ్యులు.

తమ కుమారుడు కొరివి రమేష్ యాదవ్ హైదారాబాద్ లో ప్రమాదవశాత్తు మృతి చెందగా ఈనెల 3న దశ దిన కార్యక్రమాలు ముగించుకున్న కుటుంబ సభ్యులు వారి స్వగ్రామం సూర్యాపేట మండల పరిదిలోని టేకుమట్ల గ్రామ ప్రభుత్వ పాఠశాలలో తమ కుమారుని జ్ఞాపకార్థం విద్యార్థులకు బోజన ప్లేట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రమేష్ యాదవ్ కుటుంబసభ్యులు మాట్లాడుతూ మా కుమారుడు అకస్మాత్తుగా మా నుండి దూరమై మమ్మల్ని వంటరి వారిని చేసి వెళ్లిపోయాడని వాపోయారు.

మా కుమారుడి జ్ఞాపకార్థం మా వంతు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బోజన ప్లేట్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇదే విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయులు దైధ పాపయ్య మాట్లాడుతూ టేకుమట్ల గ్రామానికి చెందిన కొరివి అంజయ్య,సైదమ్మ ల ఒక్కగానొక్క కుమారుడు. ప్రభుత్వ పాఠశాల 2017-18 టెన్త్ బ్యాచ్ విద్యార్థి కొరివి రమేష్. ప్రమాదవశాత్తు మృతి చెందడం చాలా బాధాకరమని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్ యాదవ్ కుటుంబసభ్యులు, పాఠశాల ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు గ్రామ యువకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS