TEJA NEWS

వేగంగా పునరుద్ధరణ పనులు
సూపెరింటెండింగ్ ఇంజనీర్ సురేందర్

ఉమ్మడి ఖమ్మం

గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు చోట్ల స్తంబాలు విరిగి పడడం, ట్రాన్స్ఫార్మర్లు నీటిలో మునిగిపోవడం, ట్రాన్స్ఫార్మర్ల గద్దెలు , ఇన్సులేటర్లు దెబ్బతినడం వలన విద్యుత్ అంతరాయాలు తీవ్రంగా జరగడం పట్ల ఖమ్మం సర్కిల్ పరిధిలో వేగంగా విద్యుత్ పున్నరుద్ధరణ పనులు చేపట్టడం జరిగిందని సూపెరింటెండింగ్ ఇంజనీర్ సురేందర్ తెలిపారు . ఈ సందర్బంగా సూపెరింటెండింగ్ ఇంజనీర్ సురేందర్ మాట్లాడుతూ … విద్యుత్ సరఫరా లో ఎక్కడ అంతరాయాలు లేకుండా సిబ్బంది అహోరాత్రులు శ్రమించి యుద్దప్రాతిపదికన పున్నరుద్ధరణ పనులు చేపట్టామని , ఎక్కడ కూడా అంతరాయాలు లేకుండా సరఫరా అందించామన్నారు . పక్క డివిజన్ లో ఉన్న సిబ్బంది ని కూడా పిలిపించుకొని పున్నరుద్ధరణ పనులు చేపట్టడం జరిగిందని చెప్పారు. కొన్ని చోట్లా నీళ్లలో గృహాలు మునగడం చేత వారికి కరెంట్ సరఫరా అందించలేకపోతున్నామని , కారణం తడిగా ఉండటం చేత షాక్ కు గురైయ్యే ప్రమాదం ఉందని అన్నారు . వర్షాన్ని, వరదలను సైతం లెక్కచేయకుండా చాలా సాహసోపేతంగా సిబ్బంది పనిచేస్తున్నారని ఈ సందర్భాంగా వారిని అభినందించారు. ఏజెన్సీలు అందుబాటులో బాటులో ఉన్నాయని అన్నారు. సరిపడా మెటీరియల్ ఉందని వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగుండా ఉండేందుకు మరింత అప్రమత్తంగా సిబ్బంది ఉండాలన్నారు. పునరుద్ధరణ పనులు చేసేటప్పుడు సిబ్బంది తప్పనిసరిగా స్వీయ జాగ్రత్తలు పాటించాలన్నారు.
వినియోగదారులు విద్యుత్ పట్ల జాగ్రత్త వహించాలని , విద్యుత్ స్తంభాలు, ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డు లను తడి చేతులతో ముట్టుకోరాద్దన్నారు . స్వీయ నియంత్రణ ముఖ్యమని ఎట్టి పరిస్థితుల్లో స్వయంగా విద్యుత్ మరమ్మతులు చేప్పట్టరాదని కోరారు . గుర్తింపు ఉన్న ఎలెక్ట్రిషియన్ తో మాత్రమే స్విచ్ బోర్డు లను , వైర్లను రిపేర్లు చేసుకోవాలని సూచించారు . విద్యుత్ పట్ల జాగ్రత్త వహించండి. ప్రమాదాలు కొని తెచ్చుకోకండి అన్నారు .

Print Friendly, PDF & Email

TEJA NEWS