TEJA NEWS

బెంగాల్ మాజీ ముఖ్య మంత్రి భుద్ధదేవ్ భట్టాచార్య మృతి

కోల్‌కతా:

పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య (80) ఉదయం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన కోల్‌కతాలోని తన నివాసంలో కన్నమూశారు. ఈమేరకు సీపీఎం స్టేట్ సెక్రటరీ మహమ్మద్ సలీం వెల్లడించారు.

బుద్ధదేవ్‌ భట్టాచార్య 2000-2011 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. కొన్ని సంవత్సరాలుగా ఆయన ఆరోగ్యం సరిగా లేదు. చూపు మందగించింది. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. అందుకే ప్రజా జీవితానికి దూరమయ్యారు

Print Friendly, PDF & Email

TEJA NEWS