TEJA NEWS

ముఖ్యమంత్రి గా నారా చంద్రబాబునాయుడు విఫలమయ్యారంటూ పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఆగ్రహం..

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలు అమలు చేయడంలో గోరంగా విఫలమయ్యారని పెందుర్తి శాసనసభ మాజీ సభ్యుడు అన్నం రెడ్డి అదీప్ రాజు ముఖ్యమంత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెందుర్తి నియోజకవర్గం లో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో అదీప్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెందుర్తి, సుజాతనగర్ మెయిన్ రోడ్డు కూడలి లో ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు అదీప్ రాజు పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి .. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూటికి నూరు శాతం మాట నిలబెట్టుకున్నారన్నారు. ప్రజలకు ఏనాడు కూడా మాయమాటలు చెప్పలేదని అన్నారు. ఎన్నికల్లో ప్రజలందరినీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాయమాటలు చెప్పి మోసం చేసిన విషయం ప్రజలందరికీ అప్పుడు అర్థమయిపోయిందని …. ఆయనకు త్వరలోనే ప్రజలందరూ గట్టిగా బుద్ధి చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు డాడీ ఉమామహేశ్వరరావు ఉప్పిలి కనకరాజు, అంజి, శరగడం కృష్ణవేణి, మెంటు మహేష్, మరి కొంతమంది నాయకులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS