TEJA NEWS

దగ్గుబాటి పురందేశ్వరిని కలిసిన గంకల కవిత అప్పారావు

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు,రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గం లోక్ సభ సభ్యులు దగ్గుబాటి పురందేశ్వరిని నగరంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం శాసన సభ్యులు పెన్మత్స విష్ణు కుమార్ రాజు సమక్షంలో 48వ వార్డు కార్పొరేటర్,జీవీఎంసీ భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ గంకల కవిత అప్పారావు మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు.ఈ సందర్బంగా గంకల కవిత అప్పారావు మాట్లాడుతూ విశాఖ నగరంలో కొండవాలు ప్రాంతంలో పలు సమస్యలు నెలకొని ఉన్నాయని వాటి పై సమస్యలు పరిష్కారం చూపాలని కోరారు.ఈ సందర్బంగా గుడ్ మార్నింగ్ గంకల కార్యక్రమం ద్వారా ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు వార్డులో పర్యటన చేస్తూ ప్రజా సమస్యలు పరిష్కారం కోసం జీవీఎంసీ కౌన్సిల్ లో గళం వినిపించి సమస్య పరిష్కారం చూపుతున్న గంకల కవిత అప్పారావుకు పురందేశ్వరి అభినందనలు తెలిపారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS