TEJA NEWS

హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు పెనుప్రమాదం తప్పింది. రంగారెడ్డి జిల్లా ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌ సీఐ బాల్‌రాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఢిల్లీ వెళ్లేందుకు దత్తాత్రేయ ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరారు. ఎయిర్‌పోర్టు ప్రధానరోడ్డుపై సడెన్‌ బ్రేక్‌ వేయడంతో కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో మూడు వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అప్పటికే గవర్నర్‌ కూర్చున్న వాహనం ముందుకు వెళ్లిపోవడంతో ప్రమాదం తప్పింది. గవర్నర్‌ వాహనానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని, తర్వాత ఆయన ఢిల్లీకి బయల్దేరి వెళ్లారని పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు


TEJA NEWS