TEJA NEWS

వరద బాధిత జర్నలిస్టు కుటుంబాలకు చేయూత
— నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన టీయూడబ్ల్యూజే కమిటీ
— నిరాశ్రయ జర్నలిస్టు కుటుంబాలకు అండగా ఉంటాం
— జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ

ఉమ్మడి ఖమ్మం

మున్నేరు వరద భీభత్సవానికి ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాలు జలమయమై ప్రజలు తీవ్ర నష్టానికి గురయ్యారని, అందులో పలువురు జర్నలిస్టు కుటుంబాలు కూడా సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారని అటువంటి జర్నలిస్టు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవిలు కోరారు.
ఖమ్మం ప్రెస్ క్లబ్ లో నిరాశ్రయులైన పలువురు జర్నలిస్టు కుటుంబాలకు అండగా ఉండి ఆదుకోవాలని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ ఆదేశానుసారం టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ మాట్లాడుతూ.. మున్నేరు ఉదృతకి నిరాశ్రయులైన జర్నలిస్టు కుటుంబాలకు అండగా ఉంటామని అధైర్యపడుద్దని అభయమిచ్ఛారు. గతంలో అనేక ఘటనలు జరిగినప్పుడు జర్నలిస్టుల కుటుంబాలకు తమ యూనియన్ అండగా నిలిచిందని తెలిపారు. ఆపద సమయంలో ఆదుకోవడమే టీజేఎఫ్ లక్ష్యమన్నారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి రజినీకాంత్, జిల్లా సహాయ కార్యదర్శి షేక్ జానీ పాషా, నగర అధ్యక్షులు యలమందల జగదీష్, జిల్లా నాయకులు ఉదయ్, మందుల ఉపేందర్, నగర అధ్యక్షులు బాలబత్తుల రాఘవ, శ్రీధర్ శర్మ,షేక్ మదర్ సాహెబ్, తిరుపతిరావు, కొరకొప్పుల రాంబాబు, బిక్కి గోపి, ముత్యాల కోటేశ్వరరావు, ఉత్కంఠం శ్రీనివాస్, మోహన్, జీవన్ రెడ్డి, కృష్ణారావు, ఇస్సంపల్లి వెంకటేశ్వర్లు, అప్పారావు, వెంకటేశ్వర్లు, సాయి, రవీందర్, బాబు, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS