124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ పీజేఆర్ నగర్ ఫేస్ 2 లో నివసించే దండంపల్లి రామస్వామి కి షుగర్ వ్యాధి కారణంగా ఇటీవల సర్జరీ చేసి కాలు తీసివేయడం జరిగింది. నడవలేని స్థితిలో ఉన్న రామస్వామికి హోప్ ఆఫ్ హంగర్ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ వారి సహకారంతో డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారి చేతులమీదుగా వీల్ చైర్ మరియు నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. కార్పొరేటర్ గారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి తమ డివిజన్ లోని పేద ప్రజలకు సేవ చేస్తున్న హోప్ ఆఫ్ హంగర్ సంస్థ వ్యవస్థాపకురాలు ఆలేఖ్యకు మరియు వారి బృందానికి కృతజ్ఞతలు తెలియచేసారు. రానున్న రోజుల్లో కూడా సేవా కార్యక్రమాలు ఇలాగే కొనసాగించాలని సంస్థ వారిని కోరారు. కార్యక్రమంలో మరేళ్ల శ్రీనివాస్, భిక్షపతి, మధులత, మీరయ్య, నరసింహులు, మల్లీశ్వరి, వెంకటేశ్వరరావు, రవి కిరణ్, అమూల్య, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.
నడవలేని స్థితిలో ఉన్న రామస్వామికి హోప్ ఆఫ్ హంగర్ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ
Related Posts
రామన్నపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ
TEJA NEWS యాదాద్రి భువనగిరి జిల్లా :- రామన్నపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న., తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , నకిరేకల్ ఎమ్మెల్యే…
సమగ్ర కుటుంబ సర్వే జాబితాలో ఎలాంటి తప్పులు
TEJA NEWS సమగ్ర కుటుంబ సర్వే జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా వివరాలు నమోదు చేయాలనిఎన్యూమరైటర్లను ఆదేశించిన …… జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి వనపర్తి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో కుటుంబ వివరాల జాబితాలో…