TEJA NEWS

స్మార్ట్ కిడ్జ్ లో హోరెత్తిన బతుకమ్మ సంబురం.
బతుకమ్మలను పేర్చి ఆటాపాటల్లో విద్యార్థినీల హుషారు.
పూజలు, చప్పట్లు, తాళాలు నృత్యాలతో బతుకమ్మ వేడుకలు.

ఉమ్మడి ఖమ్మం
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తున్న బతుకమ్మ సంబురాలు స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో హోరెత్తాయి. పాఠశాల చిన్నారులు మహిళా ఉపాధ్యాయులు బతుకమ్మలను శోభాయమానంగా పలు రకాల పూలతో పేర్చి బతుకమ్మకు గౌరీ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాఠశాల మైదానంలో తాము రూపొందించిన బతుకమ్మలను ఉంచి వలయాకారంలో బతుకమ్మల చుట్టూ లయబద్ధంగా చప్పట్లు తాళాలతో నృత్యాలతో వేడుకల్లో పాల్గొన్నారు. ఒక్కేసి పువ్వేసి చందమామ, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ పలురకాల గేయాలు ఆలపిస్తూ నృత్యాలు చేశారు.

విద్యార్థినీలు, మహిళా ఉపాధ్యాయునీలు పాఠశాల నుంచి బతుకమ్మలతో పాఠశాల మైదానం వరకు ప్రదర్శనతో కనువిందు చేసి సంబురాలు నిర్వహించారు. పలు రకాల నైవేద్యాలను గౌరీ మాతకు నివేదన చేసి అనంతరం నైవేద్యాలను అందరికీ పంచి ఆనందోత్సవాలతో బతుకమ్మ వైభవాన్ని చాటి చెప్పారు. అనంతరం బతుకమ్మలను నీళ్లలో నిమజ్జనం చేసే ప్రక్రియ ఉత్సాహంగా జరిపారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణచైతన్య, పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య మాట్లాడుతూ బతుకమ్మ వేడుకలు మన రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబిస్తూ విశ్వవ్యాప్తంగా ప్రతిష్టను పెంచుతున్నాయన్నారు. పుష్పాలనే భగవంతునిగా భావించి కొలిచే అరుదైన పర్వదినం బతుకమ్మ సంబరాల ద్వారా తొమ్మిది రోజులు నిర్వహిస్తున్నామన్నారు. తొలి రోజు జరిపే ఎంగిలిపూల బతుకమ్మ మొదులుకొని చివరి రోజున జరిపే సద్దుల బతుకమ్మ వేడుకల వరకు మహిళలంతా సమైక్యతను, అనుబంధాలను, ఆప్యాయతను, ఆనందాలను పంచుకుంటున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల మహిళా ఉపాధ్యాయులు , విద్యార్థుల తల్లులు పాల్గొన్నారు.


TEJA NEWS