9 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని చేపట్టిన మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపిన……….. సిపిఐ, ఏఐటీయూసీ
వనపర్తి :
వనపర్తి మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా సోమవారం 9 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని నిరవధిక సమ్మె చేపట్టిన మున్సిపల్ సానిటేషన్, తదితర విభాగాల కార్మికులకు సిపిఐ, ఏఐటీయూసీ నేతలు సమ్మె శిబిరానికి చేరుకొనిమద్దతు తెలిపారు ఈ సందర్భంగా. సిపిఐ పట్టణ కార్యదర్శి జె రమేష్, ఏ ఐ టి యు సీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ లు మాట్లాడుతూ . 9 నెలలు జీతాలు లేకుండా కుటుంబాలు ఎలా గడుస్తాయని ప్రశ్నించారు. ప్రతి నెల గడిచేందుకు నిత్యవసరాలు, ఆరోగ్యం, పిల్లల చదువులు తదితరఅవసరాలకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ప్రతినెల 1వ తేదీన్నే వేతనాలు చెల్లించాలన్నారు. 9 నెలలుగా జీతం అందకపోవడంపై సమ్మె చేస్తున్న 17 మంది కార్మికుల మధ్య చీలిక తేవటం సరికాదన్నారు. వెంటనే జీతాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వారి పోరాటానికి చివరి వరకు అండగా ఉంటామన్నారు. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీరామ్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.