జంగిల్ క్లియరెన్స్ పనులకు శ్రీకారం
తిరుపతి: “తుడ” ద్వారా అభివృద్ధి చేయనున్న శెట్టిపల్లి భూములకు అవసరమయ్యే జంగిల్ క్లియరెన్స్ పనులకు తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శెట్టిపల్లి భూములకు శాశ్వత పరిష్కారం చూపించడంతో
తిరుపతి నగరాభివృద్ధి పరిధిలో ఉన్న శెట్టిపల్లి భూములలో జంగిల్ క్లియరెన్స్, సరిహద్దులు గుర్తింపు… స్థిరీకరణ పనులు ఎట్టకేలకు ప్రారంభ మయ్యాయి. ఈ సందర్భంగా తుడా చైర్మన్, తితిదే ఎక్స్ అఫిషియో మెంబర్ డాలర్స్ దివాకర్ రెడ్డి పూజ కార్యక్రమం నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు. భవిష్యత్తులో ఇక్కడ అభివృద్ధి చెందబోయే టౌన్‌షిప్ ప్రాజెక్ట్ కి ఇది తొలి అడుగుగా నిలుస్తుంది అన్నారు.
శెట్టిపల్లి భూముల సమస్య పరిష్కారంలో ఈ జంగిల్ క్లియరెన్స్, సరిహద్దు పనులు కీలక మైలురాయిగా నిలవనున్నాయని దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.
