TEJA NEWS

వర్షబావ ప్రాంతాలలో పర్యటించిన కుత్బుల్లాపూర్ నియోజక వర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ …

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ 26వ వార్డు కె.వి.ఆర్ వ్యాలిలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వర్షాభావ ప్రాంతాలతో పాటు లోతట్టు పరిసరాల్లో పర్యటించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ .. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరద నీటి ముంపు సమస్య తలెత్తకుండా ఇప్పటికే శాశ్వత ప్రతిపాదికన చర్యలు తీసుకోవడం ద్వారా ముంపు ప్రాంతాల ప్రజలు సురక్షితంగా ఉండేందుకు గాను చర్యలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. లోతట్టు పరిసర ప్రాంతాలలో పర్యటించడం ద్వారా సమస్యలను పరిశీలించడం జరిగిందని వెల్లడించారు. ఈ తరుణంలో ఎప్పటికప్పుడు ముంపు ప్రాంతాలలో పర్యటిస్తూ నాలాల పూడికతీత, రోడ్లపై వర్షపు నీరు నిలువ లేకుండా చూడటం, గుంతలను పూడ్చతం, రోడ్లపై విరిగిన చెట్లను తొలగింపు వంటి తదితర పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పునరుద్ధరణ పనులను చేపట్టడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

Print Friendly, PDF & Email

TEJA NEWS