TEJA NEWS

వరదనీటిలో మునిగి ప్రమాదవశాత్తు లైన్ మెన్ మృతి.

మృతదేహాన్ని సందర్శించిన ఎమ్మెల్యే కృష్ణప్రసాదు .

ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, కిలేశపురం,

కృష్ణానది అకస్మాత్తుగా వచ్చిన వరదనీటిలో మునిగి విధి నిర్వహణలో ఉన్న పశ్చిమ ఇబ్రహీంపట్నంకు చెందిన విద్యుత్ శాఖ లైన్ మెన్ వజ్రాల కోటేశ్వరరావు (40) ప్రమాదవశాత్తు మృతిచెందారు.

రెండు రోజుల క్రితం కిలేశపురంలో మూలపాడుకు విద్యుత్ సరఫరా చేసే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ వద్ద బ్రేక్ డౌన్ మరమ్మతులు చేస్తుండగా ఆయన మృత్యువాత పడ్డారు. ప్రమాదస్థలం వద్ద ఉన్న లైన్ మెన్ మృతదేహాన్ని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు సందర్శించారు.

జరిగిన ఘటనను ప్రభుత్వానికి నివేదించి బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. లైన్మెన్ మృతదేహాన్ని అక్కడినుంచి తరలించి, తక్షణమే పోస్టుమార్టం చేసి బాధిత కుటుంబానికి అప్పగించాలని ఆదేశించారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS