TEJA NEWS

క్యాన్సర్ బాధితుడికి అండగా వాట్సాప్ గ్రూప్ సభ్యులు
మల్కాజిగిరి :
మల్కాజిగిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని ఇంద్రా నెహ్రూ నగర్ బస్తిక్ చెందిన సంతోష్ గత రెండు సంవత్సరాల నుండి క్యాన్సర్ బారినపడి చికిత్స పొందుతున్నాడు. క్యాన్సర్ తో ఏ పని చేయలేక ఇంట్లోనే ఉంటున్న సంతోష్ భార్య సంగీత ఇళ్లల్లో పనిచేసుకుంటూ వారి ఇద్దరు పిల్లలను చూసుకుంటూ సంతోష్ వైద్యానికి ఖర్చులు ఎల్లతీస్తుంది. ఈ మధ్య సంతోషి ని తరచూ ఆసుపత్రికి తీసుకెళుతున్న సంగీత తన భర్త వైద్య ఖర్చులకు డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని మానవసేవే మాధవసేవ గ్రూప్ సభ్యురాలు అనితకు తెలియజేయడంతో సదరు విషయాన్ని గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజుకు తెలియజేయడం జరిగింది. సంతోష్ విషయాన్ని గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు తమ గ్రూప్లో సభ్యులతో చర్చించి, కొంతమంది గ్రూప్ సభ్యుల సహకారంతో మంగళవారం సంతోష్ వైద్య ఖర్చుల నిమిత్తం పదివేల రూపాయల చెక్కుని గ్రూప్ ప్రతినిధులు సంతోష్ , సంగీతలకు అందజేశారు. ఈ సందర్భంగా గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు మాట్లాడుతూ, మల్కాజిగిరి లోని ప్రజా ప్రతినిధులు, ఎన్జీవో ప్రతినిధులు, ప్రజలు, మానవతా దృక్పథంతో సంతోష్ వైద్యానికి సహాయం అందివ్వాలని కోరారు. ఎవరైనా తమ విరాళం అందజేయాలనుకుంటే 8712799902 గూగుల్ పే, ఫోన్ పే ద్వారా సంతోష్ కి సహాయం చేయొచ్చు అని తెలిపారు. కార్యక్రమంలో గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు, మహమ్మద్ రషీద్, అనిత, మల్లేష్ యాదవ్, సిద్ధి రాములు తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS