TEJA NEWS

మంత్రి పొన్నం ప్రభాకర్,రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి

గీతా కార్మికుల ప్రమాదాల నుండి రక్షణ కోసం ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబ్దుల్లాపూర్ మెట్ మండలం లష్కర్ గుడా లో ప్రారంభించిన కాటమయ్య రక్షణ కవచ్ మోకులను పంపిణీ కి రంగం సిద్ధం చేసింది. ఆగస్టు 5 వ తేది నుండి ప్రతి నియోజకవర్గానికి వంద మోకుల చొప్పున మొదటి విడతల లో 10 వేల మోకులు పంపిణీ చేయనున్నట్లు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

ఈ కాటమయ్య రక్షక్ కవచ్ మోకులను రాష్ట్ర వ్యాప్తంగా కల్లు గీత వృత్తి చేసుకునే ప్రతి ఒక్కరికీ ఈ మోకులను పంపిణీ చేస్తామని తెలిపారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమం జరగనుందని పేర్కొన్నారు. కాటమయ్య రక్షణ కవచ్ పంపిణీ కోసం తెలంగాణ బడ్జెట్ లో కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS