వైద్య సాయానికి నిత్యం సిద్దం : ఎం ఎల్ ఏ పద్మారావు గౌడ్
సికింద్రాబాద్ : నిరుపేదలకు వైద్య సాయాన్ని అందించేందుకు తాము నిరంతరం సిద్దంగా ఉంటామని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం లోని శ్రీనివాస్ నగర్ కు చెందిన స్టాలిన్, వారాసిగుడా కు చెందిన బీ పాషా లు అనారోగ్యం బారిన పడి వైద్య సాయానికి సితాఫలమండీ లోని ఎం.ఎల్.ఏ. క్యాంపు కార్యాలయాన్ని ఆశ్రయించారు. వెంటనే ఎం.ఎల్.ఏ. తీగుల్ల పద్మారావు గౌడ్ చొరవ తీసుకొని వారికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.రెండు లక్షల చొప్పున రూ.నాలుగు లక్షల మేరకు ఎల్.ఓ.సీ. పత్రాలను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సమకూర్చి తన కార్యాలయంలో అందింజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజలకు తమ సితాఫలమండీ లోని తమ కార్యాలయం బాసటగా నిలుస్తుందని తెలిపారు. గత పదేళ్ళ కాలంలో రికార్డు సంఖ్యలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పేదలకు అందించామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
వైద్య సాయానికి నిత్యం సిద్దం : ఎం ఎల్ ఏ పద్మారావు గౌడ్
Related Posts
జగిత్యాల జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో వెల్గటూర్ మండలం కోటిలింగాలలో ఏర్పాటు
TEJA NEWS జగిత్యాల జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో వెల్గటూర్ మండలం కోటిలింగాలలో ఏర్పాటు చేసిన వందశాతం రాయితీ పైన ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా…
ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో పర్యటించిన
TEJA NEWS ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో పర్యటించిన ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ , ఈ సందర్భంగా చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ , మాట్లాడుతూ ఘట్కేసర్ మున్సిపాలిటీ 16వ వార్డులో పర్యటిస్తు…