TEJA NEWS

ఎమ్మెల్యే పంచకర్ల బాబుకు బాలరాముని విగ్రహం బహుకరణ…

జనసేన పార్టీ తరఫున రమేష్ బాబు పెందుర్తి కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేసిన తర్వాత గొన్నవానిపాలెం గ్రామ జనసైనికులు పెందుర్తి శాసనసభ్యునిగా పంచకర్ల రమేష్ బాబు విజయం సాధిస్తే అయోధ్య బాల రాముని దర్శించుకుంటామని మొక్కు కున్నారు,ఈ ఎన్నికల్లో రమేష్ బాబు ఆంధ్రప్రదేశ్లోనే జనసేన పార్టీ తరఫున అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన తరువాత గొన్నవానిపాలెం జనసైనికులు అయోధ్య వెళ్లి అయోధ్య రాముని మొక్కు తీర్చుకున్న సందర్భంగా ఆదివారం నాడు జనసేన నాయకురాలు గొన్న రమాదేవితో పాటు గొన్నవాని పాలెం యువకులు,గౌరవనీయులు పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి ఆయన కోసం ప్రత్యేకంగా తయారు చేపించిన బాలరాముని విగ్రహం బహుకరించారు

ఈ సందర్భంగా గొన్న రమాదేవి గ్రామంలో ఉండే సమస్యలపై గ్రామంలో ఉండే యువతీ యువకుల ఉపాధి అవకాశాలపై ఎమ్మెల్యే కి వివరించారు, ఈ విషయంపై ఎమ్మెల్యే స్పందిస్తూ పార్టీ కోసం కష్టపడిన వారికి పార్టీ ఎల్లవేళలా అండదండగా ఉంటుంది అని తెలియజేస్తూ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి అంశాలపై వివరణ కోరుతూ యువతీ యువకుల ఉపాధి అవకాశాలపై సంపూర్ణ హామీ ఇస్తూ ఎమ్మెల్యే ప్రత్యేకంగా మీ గ్రామం ట్రాన్స్పోర్ట్ రంగంపై ఆధారపడింది కాబట్టి ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి ఎటువంటి అవకాశాలు ఉన్న నా దృష్టికి తీసుకురావాలని రమాదేవి కి సూచించారు ఈ యొక్క కార్యక్రమంలో పెందుర్తి జనసేన నాయకురాలు గొన్న రమాదేవి తో పాటు గుమ్మాల శ్రీనివాసరావు, ఇల్లపు శ్రీనివాసరావు, గొన్న శ్రీనివాసరావు (ప్లంబర్), గొన్న బొర్రయ్య నాయుడు, గొన్న రమేష్ కుమార్,ఉరిటినారాణరావు,బూడిదనాగు,పల్లిశ్రీనివాసరావు, బలిరెడ్డికళ్యాణ్ దుల్ల రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS