TEJA NEWS

పాఠ్య పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే యం జీ ఆర్.

విద్యార్థులు ల‌క్ష్య‌సాధ‌న‌పై దృష్టి సారించాలి.

బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి.

     పాతపట్నం నియోజకవర్గం లక్ష్మినర్సుపేట, హిరమండలం, కొత్తూరు, నివగాం మరియు పాతపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎర్పాటు చేసినటువంటి పాఠ్య పుస్తకాలు పంపిణీ కార్యక్రమాలలో పాల్గొన్న  శాసనసభ్యులు   మామిడి గోవిందరావు  ముఖ్య అతిధిగా హాజరయ్యారు . ఈ సందర్బంగా మామిడి గోవింద రావు  మాట్లాడుతూ విద్యార్థుల్లో ఒక ల‌క్ష్యాన్ని ఏర్ప‌రుచుకొని దానిని సాధించే దిశ‌గా ప్ర‌య‌త్నం చేస్తూ విద్య‌పైనే దృష్టి సారించాల‌ని, విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి, విద్యతోనే సమాజ అభివృద్ధి తెలిపారు. ప్ర‌తీ ఒక్కరు కష్టబడి కాకుండా ఇష్టబడి చదవాలని విద్యార్థులకు సూచించారు. 

అలా చదివి మంచి ఫలితాలు సాధించి ఉన్నత పదవులు అధిరోహించాలని హితవు పలికారు. ప్రభుత్వ విద్యా బలోపేతంలో భాగంగా ప్రతి ఒక్కరూ లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని సాధించే దిశగా ప్రయత్నం చేయాలన్నారు. విద్యార్థి దశలో ఇతర విషయాలపై దృష్టి సారించకుండా చదువుపైనే మనసు లగ్నం చేసి తల్లితండ్రుల, ఉపాధ్యాయుల ఆశలను నెరవేర్చాలని కోరారు. చిత్తశుద్ధి, పట్టుదలతో ప్రయత్నించిన వారికి విజయాలు తప్పక సొంతమవుతాయని  విద్యార్ది , విద్యార్థినులకు చెప్పారు. విద్యార్థి ద‌శ‌లో ఇంట‌ర్మిడియేట్ ఎంతో కీల‌క‌మ‌ని, మీరు ఏం సాధించాల‌నుకుంటున్నారో దానికి ఇక్క‌డే పునాది పుడుతుంద‌ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ లెక్చరర్లు, క‌ళాశాల సిబ్బంది, విద్యార్థులు  పాల్గొన్నారు.
Print Friendly, PDF & Email

TEJA NEWS