TEJA NEWS

మోకిలా లా లాపాలోమా విల్లాలను పరిశీలించిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

శంకరపల్లి : నాలుగు రోజుల నుండి కురుస్తున్న బారి వర్షానికి మోకిలా లా పాలోమా విల్లాలు నీట మునిగిన విషయం తెలిసిందే . లా పాలోమా విల్లాలను స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పరిశీలించారు. రానున్న రోజులలో వర్షాలు ఎక్కువ ఉన్నాయని ఇలాంటి ప్రమాదాలు జరగకుండా శాశ్వత పరిష్కారం చేస్తానని విల్లా నివాసులకి ధైర్యాన్ని ఇచ్చారు.కమ్యూనిటీ మొత్తం 212 విల్లాలు ఉండగా వాటిల్లో దాదాపు 1000మంది నివాసం ఉంటున్నారు. టాక్స్ లు గ్రామపంచాయతీ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నాం, కనీస సౌకర్యాల ఏర్పాట్లు మర్చిపోతున్నారు అనే ఉద్దేశంతో తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం నుండి నీళ్లలోనే ఉంటున్నాం, మా బాధలు తీరేది ఎట్లా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి లాపలోమ ప్రాజెక్ట్ కమ్యూనిటీలో నెలకొంది. జిల్లా స్థాయి అధికారులు ,పంచాయతీ సెక్రెటరీ ఎంపీడీవో, కమ్యూనిటీ పరిసరాల్లో ఉండి నీటిని బయటికి పంపించారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS