మసీదు సదర్ కుటుంబానికి ఎంపీ పరామర్శ..
ఉమ్మడి ఖమ్మం
నగరంలోని కమాన్ బజార్ మసీద్ సదర్ అజీజ్, ఆయన సోదరి ఇటీవల ఓ ప్రమాదoలో మృతి చెందగా.. వారి కుటుంబాన్ని ఖమ్మo ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి పరామర్శించారు. కస్పాబజారు లోని మృతుల నివాసానికి వెళ్లి మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి.. తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్, మైనార్టీ నాయకులు ఎండీ. ముస్తఫా, నాయకులు మిక్కిలినేని నరేందర్, మజీద్, ఖాసీం, ఇమామ్ మియా, హకీం, గఫార్ తదితరులు పాల్గొన్నారు.