TEJA NEWS

మోకిలలో వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎంపీడీవో వెంకయ్య గౌడ్

శంకర్పల్లి : మోకిల గ్రామ రైతు వేదిక వద్ద 68వ జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను శంకర్‌పల్లి ఎంపీడీఓ వెంకయ్య గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. ఎంపీడీఓ మాట్లాడుతూ విద్యార్థులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని, ఓటమి నుంచి పాఠం నేర్చుకుని మరింత పట్టుదలతో విజయం కోసం ప్రయత్నించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ అక్బర్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


TEJA NEWS