TEJA NEWS

వరద బాధితులకు అండగా ఎం పి జె

ఉమ్మడి ఖమ్మం

మున్నేరు వరద భీభత్సవానికి ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాలు జలమయమై, ప్రజలు తీవ్ర నష్టానికి గురయ్యారు. అందులో పలు పేద కుటుంబాలు సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. స్థానిక 47 వ డివిజన్ బొక్కల గడ్డ వెంకటేశ్వరా నగర్ లోని వరద బాధితులకు మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఖమ్మం శాఖ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం, బట్టలు, దుప్పట్లు తదితర వస్తువులను పంపిణీ చేయడం జరిగింది. ఎంపీజే జిల్లా అధ్యక్షులు షేక్ ఖాసిం నిరాశ్రయులైన వరద బాధితుల సమస్యలను అడిగి తెలుసుకుని, ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాలను ఆడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీజే జిల్లా కార్యదర్శులు బొగ్గవరపు సతీష్, సయ్యద్ రఫీక్, కోశాధికారి మొహమ్మద్ హకీమ్ తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS