TEJA NEWS

నక్సలైట్లు ఆయుధాలు వదలాలి శాంతిని నెలకొల్పాలి -ఏబివిపి

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం మరియు వెల్దండ మండల శాఖ ఆధ్వర్యంలో నక్సలైట్లు ఆయుధాలను వదిలి జన స్రవంతిలో కలవాలని నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏ బి వి పి కార్యదర్శి అక్కి వంశీ మాట్లాడుతూప్రజాస్వామ్య దేశంలో హింస ద్వారా దేనిని సాధించలేరని ఇప్పటివరకు మావోయిజం పేరుతో నక్సలైట్లు సాధించింది శూన్యమని, నక్సలైట్ ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని పేర్కొన్నారు ఈరోజు మన భారతదేశానికి స్వాతంత్రం అహింసా మార్గంలో వచ్చిందని ,మొన్నటికి మొన్న తెలంగాణ ఉద్యమం కూడా అహింసా మార్గంలోనే ప్రజాస్వామ్యబద్ధంగా సాధించుకున్న విషయం అందరికీ తెలిసిన విషయమే.
మన రాష్ట్రంలోని కొంతమంది మేధావుల రూపంలో చలామణి అవుతున్న అర్బన్ నక్సలైట్లు యూనివర్సిటీలో చదువుకోవడానికి వచ్చే పేద విద్యార్థుల యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారికి లేనిపోని మాటలు చెబుతూ అడవుల్లోకి వెళ్లేటట్టు ప్రోత్సహిస్తున్నారు .

మావోయిజం మంచిది అని చెప్పే ఈ మేధావులు మరి వారి పిల్లల్ని అడవుల్లోకి పంపించకుండా అమెరికా, ఆస్ట్రేలియా దేశాలకి పంపించి చనిపోయిన నక్సలైట్ల శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయం ఈ అర్బన్ నక్సలైట్లు చేయడం దౌర్భాగ్యమైనటువంటి.
ఈరోజు ఎక్కడైతే మావోయిజం ఉందో అక్కడ రోడ్లు వేయలేని పరిస్థితి పాఠశాలలను కట్టలేని పరిస్థితి మంచి వైద్యం అందించ లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు అనేకంగా ఉన్నాయి. ఎక్కడైతే నక్సలైట్ల ఉనికి లేదో అక్కడ నాణ్యమైన రోడ్లు, మంచి పాఠశాలలు, వైద్య సౌకర్యాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగైనటువంటి విషయాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. నక్సలిజం కచ్చితంగా అభివృద్ధి నిరోధక సిద్ధాంతం.
నక్సలైట్లు చెప్పే శాంతి చర్చలు ఏవైతే ఉన్నాయో కేవలం వారి యొక్క ఉనికి ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చినప్పుడే నక్సలైట్లు శాంతి చేర్చాలని పేరుతో అర్బన్ నక్సలైట్ల ద్వారా ప్రభుత్వాలకి రాయబారాలు పంపిస్తున్నారు. మరి కగార్ ఆపరేషన్ చేపట్టకు ముందు శాంతి చర్చల యొక్క మాట ఎందుకు మాట్లాడలేకపోయారు అని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటికొండ ప్రశాంత్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.