Spread the love

మున్సిపాలిటీల పరిధిలో పన్నుల వసూళ్లపై వేగంగా లక్ష్యాలను సాధించాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి
వనపర్తి
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో ఆస్తి, నల్ల పన్నుల వసూళ్లపై ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని, వేగంగా లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి ఆదేశించారు.

       వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో జంగిడిపురం ప్రాంతంలో పర్యటించిన కలెక్టర్,  మున్సిపాలిటీ సిబ్బంది టాక్స్ వసూలు చేస్తున్న తీరును పరిశీలించారు. అనంతరం మున్సిపాలిటీ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. 

    కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో ప్రాపర్టీ, నల్లా పన్నుల వసూళ్ల వేగం పెంచాలని, ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించడానికి వీల్లేదని సూచించారు. బ్లాక్ ల వారీగా పన్నువసుల కోసం  నియమించిన సిబ్బందికి పకడ్బందీగా శిక్షణ ఇచ్చి వేగంగా పన్నులు వసూలు అయ్యేలా చూడాలని ఆదేశించారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా  ప్రణాళికాబద్ధంగా పన్నుల వసూళ్లపై పనిచేయాలన్నారు.  బిల్ కలెక్టర్లు, సిబ్బంది ఉదయం 7 గంటలకు పురపాలక కార్యాలయంలో హాజరు వేసి క్షేత్రస్థాయిలో విధులకు హాజరై పన్నుల వసూలు మొదలు పెట్టాలన్నారు. 

    క్షేత్రస్థాయిలో పన్ను వసూళ్ల కోసం వెళ్లే సిబ్బంది వద్ద తప్పనిసరిగా అత్యధిక బకాయిలు ఉన్న వారి జాబితా ఉండాలని సూచించారు. పేమెంట్స్ ఏ విధంగా తీసుకోవాలని విషయంపై వారికి అవగాహన కల్పించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు.  బకాయిలు ఉన్నవారికి నోటీసులు పంపించాలని పోస్ట్ ద్వారా, మరియు డోర్ టు డోర్ వెళ్లినప్పుడు కూడా నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. బల్క్ మెసేజ్ ల ద్వారా కూడా బకాయిదారులకు పన్ను చెల్లింపు పై  సందేశాలను పంపించాలని సూచించారు.   అదేవిధంగా, అన్ని బ్లాక్లలో పన్నువసుళ్ళకై ప్రత్యేక క్యాంపులు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బందిని పనితీరును సూపర్వైజర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని చెప్పారు. ఇక పురపాలక పరిధిలో నల్లచెరువు ట్యాంక్ బండ్ సుందరీకరణ, అభివృద్ధి పనుల కోసం వేగంగా టెండర్లను పిలిచి గ్రౌండింగ్ స్టార్ట్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులకి ఆదేశించారు. 

   అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య,  మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, ఇతర పురపాలక సిబ్బంది తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.