TEJA NEWS

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : డీఎంఎచ్ వో.


సూర్యాపేట జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి సూర్యాపేట వారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రామాలు జలమయమైయ్యాయి. అక్కడి పరిస్థితులు పరిశీలించుటకు డాక్టర్ కోటాచలం గ్రామాన్ని సందర్శించి వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచనలు మరియు కలుషితమైన నీటి ద్వారా, దోమల ద్వారా, ఈగల ద్వారా వచ్చే వ్యాపించే అంటూ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గ్రామ ప్రజలకు తెలియజేయడం జరిగినది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కాచి చల్లార్చిన నీటిని మాత్రమే త్రాగాలి.
క్లోరినేషన్ చేసిన నీటిని మాత్రమే తీసుకోవాలి. 
కుక్కడ గ్రామపంచాయతీ సిబ్బందికి త్రాగునీటిని తప్పకుండా క్లోరినేట్ చేయవలసిందిగా సూచించారు.
ముందస్తు చర్యగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. 
అంటువ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య సిబ్బందికి తగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగినది.
Print Friendly, PDF & Email

TEJA NEWS