
జగన్ రెడ్డీ… నీ పంథా మార్చుకో
** టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింధూజ
తిరుపతి: గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్ రెడ్డి వికృతచేష్టలతో ఆంధ్రరాష్ట్ర ప్రజలకు చూపించిన నరకం వారు జీవితంలో ఎన్నడు మర్చిపోరని, జగన్ రెడ్డి దుర్మార్గపు చేష్టల విధానంలో ఇకనైనా జగన్ రెడ్డి పంథా మార్చుకోవాలని టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబూరు సింధూజ హితవు పలికారు. సోమవారం సాయంత్రం ఆమె తిరుపతి కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సింధూజ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వాన్ని, ఆరాచక పాలనను భరించిన ఆంధ్రప్రజలు ఇప్పుడు చంద్రబాబునాయుడు సారథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా చేస్తున్న సంక్షేమ పథకాలతో సేద తీరుతున్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేని జగన్ రెడ్డి అమరావతి రాజధాని మీద నోటికివచ్చినట్టు తన అనుయాయులతో మాట్లాడిస్తూ రాష్ట్ర రాజధాని మీద దుష్ప్రచారం చేయిస్తూ అక్కసు వెళ్ళబోస్తున్నట్లుందని ఎద్దేవా చేశారు. పత్రికలు, టీవీలు, ప్రచార మాధ్యమాలను నీ ఉనికి కోసం నువ్వు ఎంతనీచంగా వాడుకున్నావో నీకైనా అర్థమవుతుందా జగన్ రెడ్డి అని ప్రశ్నించారు. జగన్ రెడ్డికి తెలిసింది ఒకటే అతను అనుకున్నది చేయడం లేదా తుడిచిపెట్టడం అంటే అతని మాటని ధిక్కరించిన వాళ్ళని పాతాళానికి తొక్కేయడం, ఇవే ఆయనకు తెలుసన్నారు.
అతను వ్యవస్థల్ని సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించాడని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడని, ఇదే జగన్మోహన్ రెడ్డికి తెలిసిన రాజనీతి అన్నారు. ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ప్రజల మెడలువంచి వేల కోట్లు వెనకేసుకున్న జగన్ రెడ్డి ఇంట్లో కూర్చొని ఉన్మాదక్రియలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. మద్యం, ఇసుక, మైనింగ్, లాంటి మాఫియా కుంభకోణాలతో ఎన్నో అరాచకాలకు పాల్పడిన నాయకులందరినీ కాపాడుకోవడానికి మీడియా ద్వారా ప్రజల మనసులను మళ్ళించడం కోసం జగన్ రెడ్డి చేసే డ్రామాల్లో ఇది కూడా ఒకటన్నారు. ఉన్న నాయకులతో పిచ్చికూతలు, వెర్రిరాతలు రాయిస్తూ సైకో శాడిజాన్ని ప్రదర్శిస్తున్న జగన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ ను ప్రజలే రోడ్డుమీద నిలబెట్టి కొట్టే పరిస్థితి నువ్వే తెచ్చుకున్నావన్నారు. సంవత్సరాలుగా అమరావతిలోనే ఉన్న జగన్ రెడ్డి భార్య భారతి కూడా వేశ్యనేనా..? వివరణ ఇవ్వాల్సిన బాధ్యత జగన్ పై ఉందన్నారు. ఆడవారిని కించపరిచిన ఏ మనిషి చరిత్రలోనే బాగుపడలేదన్నారు. దయచేసి ఇలాంటి వికృత క్రీడల్ని ఆపుతావని, మహిళల తరఫున మేము కోరుకుంటున్నామని…,ఇదే మళ్లీ మళ్లీ పునరావృతమైతే ప్రజలంతా నిన్ను తరిమి తరిమి కొట్టే పరిస్థితి త్వరలోనే వస్తుందని ఆంధ్ర రాష్ట్ర మహిళల తరఫున హెచ్చరిస్తున్నామన్నారు.
