TEJA NEWS

కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ లో ఘనంగా పోలీస్ అమరవీరుల వారోత్సవాలు.

పోలీస్ కమీషనరేట్ పరేడ్ గ్రౌండ్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు.

పోలీసు అమరవీరుల సంస్మరనార్ధం రక్తదాన కార్యక్రమం ఏర్పాటు.

రక్తదానం చేసిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఐపీఎస్.

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా
బుధవారంనాడు కరీంనగర్ పోలీసు కమీషనరేట్ కేంద్రంలోని పరేడ్ గ్రౌండు నందు రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేశామని కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలను కోల్పోయిన పోలీసు అమరవీరులను స్మరిస్తూ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. కమీషనరేట్ లోని అన్ని విభాగాలకు చెందిన పోలీసు అధికారులతో పాటు కమీషనరేట్ శిక్షణ కేంద్రంలోని శిక్షణ కానిస్టేబుళ్లు సైతం ఇందులో పాల్గొన్నారన్నారు. దాదాపు 200 మంది రక్తదానం చేసారని తెలిపారు. సేకరించిన ఈ రక్తాన్ని కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అందిస్తున్నామన్నారు.
పోలీసులతో పాటు ప్రజలు కూడా వచ్చి స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (శాంతి భద్రతలు) ఎ. లక్ష్మీనారాయణ , అడిషనల్ డీసీపీ (ఏ ఆర్) అనోక్ జయ్ కుమార్ లతో పాటు ఏసీపీలు విజయ్ కుమార్ , మాధవి , నరేందర్ , వెంకటరమణ, కమిషనరేట్ లోని ఇన్స్పెక్టర్లు కోటేశ్వర్ , విజయకుమార్, జాన్ రెడ్డి, స్వామి , ప్రకాష్ గౌడ్ , రిజర్వు ఇన్స్పెక్టర్లు రజినీకాంత్, కుమార స్వామి, జానీమియా , శ్రీధర్ రెడ్డి మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.


TEJA NEWS