TEJA NEWS

గణేష్ విగ్రహ ఏర్పాటు కోసం పోలీస్ అనుమతి తప్పకుండా తీసుకోవాలి…
గణేష్ నవరాత్రుల ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి…
పోలీస్ కమిషనర్ సునీల్ దత్

ఉమ్మడి ఖమ్మం

గణేష్ విగ్రహ ఏర్పాటుకు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. గణేష్ మండపాల కోసం ముందుగా వారు ఏర్పాటు చేస్తున్న గణేష్ ప్రతిమ ఎత్తు ఏర్పాటు చేస్తున్న ప్రదేశం నిమజ్జనం తేదీ ప్రదేశం మొదలగు సమాచారం తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ ప్రోటోకాల్ వెబ్సైట్
https://policeportal.tspolice.gov.in/index.htm ద్వారా మండపాల నిర్వాహకులు పూర్తి వివరాలు నమోదు చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అనంతరం స్టేషన్ పోలీస్ అధికారులు ఆన్లైన్ ద్వారా అనుమతులు జారీ చేస్తారని తెలిపారు. అదేవిధంగా గణేష్ నవరాత్రులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరూ మైకు పర్మిషన్ విధ్యుత్ శాఖ నుండి పర్మిషన్ తీసుకోవాలని సూచించారు. గణేష్ మండలంలో ప్రశాంతంగా గణేష్ నవరాత్రులు జరగాలని ఎటువంటి గొడవలు జరగకుండా యువత కమిటీ సభ్యులు జాగ్రత్తలు తీసుకొని విజ్ఞప్తి చేశారు.

గణేష్ మండపాల నిర్వాహకులకు సూచనలు

1) గణేష్ విగ్రహాల ఏర్పాటుకు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నిర్వాహకుల పేర్లు మరియు సంప్రదింపు నంబర్లు పొందుపర్చాలి.

2) విగ్రహం ఏర్పాటు స్థలం ప్రైవేట్ వ్యక్తికి చెందినదైతే, సంబంధిత వ్యక్తుల నుండి ఎటువంటి అభ్యంతర లేదని ధృవీకరణ పత్రం పొందాలి.

3) నిర్వాహకులు “విగ్రహాలను రహదారిలో కాని వివాదాస్పద స్థలాల్లో ప్రతిష్టించవద్దని విజ్ఞప్తి.

4) ప్రధాన రహదారులపై మరియు ట్రాఫిక్ రద్దీగా వుండే రహదారులపై విగ్రహాలను ఏర్పాటు చేయరాదు.

5) పోలీసులకు సమర్పించేటప్పుడు విద్యుత్ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి మరియు దానిని వారి దరఖాస్తులకు జతచేయాలి.

6) విద్యుత్ షార్ట్ సర్క్యూట్ నివారించేందుకు.నాణ్యమైన విద్యుత్ తీగలు మరియు పరికరాలు గణేష్ పండల వద్దఉపయోగించాలి.

7) మండపాల వద్ద డి జె లకు అనుమతి ఇవ్వబడదు,రెండు మైక్ తో కూడిన స్పీకర్లు(ధ్వని పరిమాణం తప్పనిసరిగా నాన్ డిస్ట్రబెన్స్ లెవెల్‌లో ఉండాలి) మాత్రమే అనుమతించబడతాయి.అదేవిధంగా ఉదయం 6.00 నుండి రాత్రి 10.00 వరకు సమయాలను అనుసరించి మైక్ సౌండ్ సిస్టమ్ వినియోగించాలి.

8) గణేష్ మండపాల వద్ద అసభ్యకరమైన నృత్యాలు, కార్యక్రమాలు చేపట్టకూడదు.

9) ప్రతి గణేష్ మండపంలో ఇద్దరు సభ్యులు 24 గంటలు ఉండేలా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి.

10) ప్రతి గణేష్ మండపం వద్దనోటీసు బోర్డును,పాయింట్ బుక్ ఏర్పాటు చేసి తప్పనిసరిగా నిర్వాహకుల సంప్రదింపు నంబర్లు మరియు వివరాలను పొందుపర్చాలి.

11) అగ్ని ప్రమాదాలను నివారించడానికి ప్రతి మండపం దగ్గర తప్పనిసరిగా ఫైర్ ప్రూఫ్‌గా ఉండేలా చూసుకోండి. తగినంత నీరు ఇసుక అందుబాటులో వుండాలి.

12) సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దు. అలాంటి ప్రచారాలు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి.

13) సోషల్ మీడియాలో అసభ్యకరమైన మరియు మతపరమైన సందేశాల రూపంలో పుకార్లు వ్యాప్తి చేసే వ్యక్తులపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS