TEJA NEWS

నాగర్ కర్నూల్ జిల్లా….

కోడిపందాల స్థావరాల పై పోలీసుల ఆకస్మిక దాడి

కోడేరు మండలం బాడుగదిన్నె గ్రామ సమీప వ్యవసాయ పొలం దగ్గర కొందరు కోడిపందాలు ఆడుతున్నట్లు సమాచారం రావడంతో ఎస్ఐ గోకారి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. పోలీసుల రాకను గుర్తించిన నిర్వహకులు, కోడిపందాలు ఆడుతున్న వారు పరారయ్యారు. ఘటన స్థలంలో 25 బైకులు, 12 కోడిపుంజులను పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు…


TEJA NEWS