TEJA NEWS

ఖమ్మం రూరల్ మండలంలో పొంగులేటి ప్రసాద్ రెడ్డి

ఉమ్మడి ఖమ్మం

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా వరద ముంపుకు గురైన రాజీవ్ గృహకల్ప, నాలుగవ తరగతుల ఉద్యోగుల కాలనీ, వికలాంగుల కాలనీ ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా బాధితులతో ఆయన మాట్లాడుతూ మంత్రి పొంగులేటి చొరవ తో కాలనీలో నష్టపోయిన ప్రతీ కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. ఎవరూ అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు. అనంతరం ముంపు ప్రాంత బాధితులకు పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ కార్యక్రమాన్ని ప్రసాద్ రెడ్డి ప్రారంభించారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS