TEJA NEWS

తాడిచర్ల ప్రభుత్వ కళాశాలలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

భూపాలపల్లిజిల్లా :
భూపాలపల్లి జిల్లా మల్హార్ మండలం తాడిచర్ల ప్రభు త్వ జూనియర్ కళాశాలలో ఆచార్య జయశంకర్ జయం తి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు

మలహార్ మండల కేంద్రం లోని తాడిచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి విజయదేవి ఆదేశాల మేరకు ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు NSS ఆధ్వర్యంలో నిర్వహించారు

ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని దార పోసిన తెలంగాణ సిద్ధాంత కర్త అని ఈ సందర్భంగా కొనియాడారు.

తెలంగాణ ఉద్యమ భావ జాల వ్యాప్తికి జయశంకర్ చేసిన కృషి నిర్వచనీయ మని, స్వరాష్ట్ర సాధనలో ఆయన పేరు ఒక దిక్సూచి గా నిలిచిపోయిందన్నారు.

ఈ నేపథ్యంలోనే ముందు గా కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు తెలంగాణ జాతిపిత సిద్ధాంతకర్త జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో NSS ప్రోగ్రాం ఆఫీసర్ రవీందర్ అధ్యాపకులు నరేందర్, ప్రవీణ్, వెంకట్ రెడ్డి, కరుణాకర్, స్వరూప రాణి, రమేష్, నరేష్, భరత్ రెడ్డి, జైపాల్, రవి కళాశాల సిబ్బంది రవి, కిరణ్ షబ్బీర్ తో పాటు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..

Print Friendly, PDF & Email

TEJA NEWS